Mancherial: దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు
రామగుండం పోలీస్ కమిషనరేట్ (CLiC2NEWS): మంచిర్యాల జోన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి బంగారం ఆభరణాలు,వెండి ఆభరణాలు, బైక్ LED TV, హోమ్ థియేటర్, గిటార్ వీటి మొత్తం విలువ…11,72,000 స్వాధీనం చేసుకున్నారు. పట్టణ కేంద్రంలోని “M” కన్వెషన్ హల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్వె దొంగతనాలకు పాల్పడుతున్న ముఠ వివరాలు వెల్లడించారు.
నస్పూర్ మండలాని చెందిన పాగిడి కార్తీక్, మంచిర్యాలకు చెందిన తాటి కొండ స్వామి చరణ్ అలియాస్ మున్నా, బెల్లంపల్లి మండలం లక్ష్మిపురం గ్రామానికి చెందిన పుప్పాల రాహుల్, నస్పూర్ మండలం సుందరయ్యా కాలనీ కి చెందిన గన్నారం మధుకర్, ఆసిఫాబాద్ తిర్యాల మండలంకు చెందిన కుర్సింగ ఈశ్వర్, మడావి రాము , కన్నెపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ ఉన్నారు.వీరంతా పగటి పూట బైక్‌పై తాలం వేసి ఉన్న ఇళ్లను గమనిస్తూ.. రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వీరంతా 19 నుండి 22 ఏళ్ల మధ్య వయస్సువారే కావటం గమనార్హం.