Mancherial: బీజేపీ ఆధ్వర్యంలో `గోదావరి వంతెన పోరు దీక్ష`

మంచిర్యాల‌ (CLiC2NEWS): మంచిర్యాల – అంతర్గాం మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గోదావరి వంతెన పోరు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ సిఎం కేసీఆర్ రూ.125 కోట్లతో మంచిర్యాల గోదావరి నదిపై వంతెన నిర్మిస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదన్నారు.

మంచిర్యాల-అంతర్గాం మధ్య గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపడితే ఉమ్మడి కరీంనగర్, పెద్ద‌పెల్లి, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు రవాణా దూరం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణం చేపట్టాలని ఆయన ఈ సంద‌ర్బంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.