Mancherial: పత్తి గట్టయ్య సేవలు చిరస్మరణీయం

మంచిర్యాల (CLiC2NEWS): కోల్డ్ బెల్ట్ ప్రాంతంలో అనేకమంది నిరుపేదలకు సామాజిక సేవాల ద్వారా గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప మనుసున్న వ్యక్తి కి,శే. పత్తి గట్టయ్య అని జిల్లా వ్యాప్తంగా ఆయన చేసిన సేవలు చిర స్మరణీయమని నస్పూర్ మున్సిపల్ చైర్ పర్సన్ ఈసం పల్లి ప్రభాకర్, టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి, కౌన్సిలర్, మహిళా నాయకురాలు బండి పద్మ,బీసీ సంఘం నస్పూర్ పట్టణ అధ్యక్షుడు పత్తి గట్టయ్య ట్రస్ట్ కమిటీ సభ్యుడు మోతే కనకయ్య లు కొనియాడారు.
శనివారం నస్పూర్ మున్సిపల్ పరిధిలోని సాయి అంధుల పాఠశాల,ఆర్కే-5 లోని వృద్ధాశ్రమంలో పత్తి గట్టయ్య 56వ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కార్మికుల జీవనం సాధించి అంచలంచలుగా ఎదుగుతూ ఉత్తర తెలంగాణలోని వస్త్ర వ్యాపారాలలో తన దంటూ ప్రత్యేకత చాటుకుని, ప్రతి ఒక్కరు హృదయాలను గెలుచుకున్న మహనీయుడు అన్నారు. నిరుపేదల పట్ల ఆయన అనేక సేవాకార్యక్రమాలు కొనసాగిస్తూ ఇటు వ్యాపార రంగంలో అటు రాజకీయాల్లో ,టిఆర్ఎస్ పార్టీలో కీలక పాత్రను పోషిస్తూ లక్షలాది మంది అభిమానుల హృదయాలను గెల్చుకున్నారన్నారు. ఆయన భౌతికంగా ప్రజలమధ్య లేకపోయినా ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.. పత్తి గట్టయ్య తనయుడు పత్తి వెంకటేష్ నేను సైతం అంటూ తండ్రి పేరిట స్వచ్ఛంద సేవా సంస్థలు నెలకొల్పి వేలాది మందికి భరోసాకల్పిస్తూ… కరోనా బాధితులకు సేవలందిస్తూ నిరుపేద, కార్మిక, వ్యవసాయ కుటుంబాలకు ఆర్థిక సామాజికపరంగా చేయూతనిస్తూ అండగా నిలవడం సంతోష దాయకమన్నారు. పత్తి గట్టయ్య ఆశయ సాధనలో నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ సేవలు అందిస్తున్న పత్తి వెంకటేష్ కు ప్రతి ఒక్కరు ఆశీస్సులు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు మల్లె తుల రాజేంద్ర పాణి, జక్కుల రాజేశం, మంచిర్యాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కమలాకర్ రావు, నాయకులు కౌన్సిలర్లు జబీనా బేగం, హైమద్, గంగా, ఎర్రన్న, ఎం డి నాసార్, ఘర్ష భీమన్న, తోకల సురేష్, విక్రమ్ కుమార్, జ్యోతి, మహేందర్, బండి తిరుపతి, రాజేష్, తిరుపతి, కాటంరాజు, నోముల నరేందర్ రెడ్డి, గౌతమ్, ప్రశాంత్, సాయి, జనార్ధన్, రఘు, ప్రమోద్, సత్తన్న, రామచంద్రారెడ్డి, జాడి భాను చెందర్, బొడ్డు చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.