మహిళల రక్షణ, భద్రత షిటీం బాధ్యత
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/SHR-TEEM-Awareness-programme.jpg)
మంచిర్యాల (CLiC2NEWS): పట్టణంలోని కస్తూర్బా పాఠశాలనందు మంచిర్యాల టీమ్ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.
పాఠశాలలోని విద్యార్థులతో ఎస్ఐ మాట్లాడుతూ.. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ”మహిళల భద్రత ను దృష్ట్యా.. ‘మీ భద్రతే మా లక్ష్యం’ అనే నినాదం తో “అభయ ( మై అటో సేఫ్) అనే మొబైల్ అప్లికేషన్” ను రామగుండం సిపి రెమా రాజేశ్వరి ప్రారంభించారని తెలిపారు. దీనిని అత్యవసర సమయంలో ఎలా ఉపయోగించాలి, దాని ఉపయోగంను విద్యార్థులకు టీచర్ లకు వివరించారు. ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించడం షి టీం బాధ్యత అని , మహిళలు ఏదైనా సమస్య వస్తే దైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, స్కూల్ విద్యార్ధినిలకు సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి, హక్ ఐ app గురించి వివరించారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే షీ టీం పోలీసులు స్పందించి మహిళకు షీ టీమ్ సహాయం చేస్తాయని తెలిపారు. అత్యవసర సమయంలో డయల్ 100 కి, రామగుండం పోలీస్ కమిషనరేట్ షీ టీమ్ 6303923700 నెంబర్, స్థానిక పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు, వెంటనే స్పందించి మీ రక్షణకై షీ టీమ్, పోలీసులు అందుబాటులో ఉంటారని తెలిపారు అదేవిధంగా ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ఓబులమ్మ, కానిస్టేబుల్ జి సతీష్ ,మహిళా కానిస్టేబుల్ జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.