మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులపై నిఘా: డీసీపీ అఖిల్ మహాజన్

మంచిర్యాల (CLiC2NEWS): అన్ని వర్గాల వారు పోలీసులతో సహకరించాలి ,శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు వీడియో క్లిప్పింగ్స్, గుర్తులను అప్లోడ్ చేసి ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా పోస్టులు పెట్టడం జరిగింది. సోషల్ మీడియా పై , మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులపై, వారి కదలికలపై నిఘా పెట్టడం జరిగిందని చెప్పారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవ్యతిరేక, ప్రజా శాంతి కి భంగం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు .మంచిర్యాల జిల్లా ప్రజలు ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటారని , ఇప్పటి వరకు మంచిర్యాలలో శాంతిభద్రతల కు విఘాతం కలుగలేదు అని , అన్ని మతల,వర్గాల వారు సోదరులు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నారని,ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా అందరికి,అన్ని ప్రాంతాల వారికీ ఆదర్శంగా నిలివాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మవద్దని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులతో సహకరించాలని ఇంచార్జ్ డీసీపీ గారు కోరడం జరిగింది .