ముంపు బాధితుల‌ను ఆదుకుంటాం: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి

మంచిర్యాల (CLiC2NEWS): ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల కారంణంగా మంచిర్యాల జిల్లాలోని ముంపు గ్రామాల‌పై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వ విప్‌బాల్క సుమ‌న్‌, ఎమ్మెల్యేల‌తో క‌లిసి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో కొత‌కు గురైన రోడ్లు, చెక్ డ్యామ్స్ మ‌ర‌మ్మ‌తుల‌కు ఆర్ అండ్‌బి శాఖ నుండి రూ. 1.75 కోట్లు, పంచాయితీ రాజ్‌శాఖ నుండి రూ. 50 ల‌క్ష‌ల నిధులు అవ‌స‌ర‌మ‌ని అంచ‌నా వేశారు. పూర్తి స్థాయి ఆస్తి న‌ష్టం వివ‌రాల‌ను సోమ‌వారం ముఖ్య‌మంత్రి కెసిఆర్‌ను క‌లిసి వివ‌రిస్తామ‌ని తెలిపారు. అత్య‌ధిక వ‌ర్ష‌పాతం లిగిన జిల్లా కాబ‌ట్టి వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రిని విప్ బాల్క‌సుమ‌న్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.