టైమ్ అతిక్రమిస్తే చర్యలు తప్పవు: ట్రాఫిక్ ఎసిపి బాలరాజు

మంచిర్యాల (CLiC2NEWS): పట్టణం లోని మార్కెట్ ఏరియాలో ఈ రోజు వర్తక,వ్యాపార షాపుల యజమానులకు, హనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, అలాగే లోడింగ్, అన్లోడింగ్ టైమింగ్ గూర్చి ట్రాఫిక్ ఎసిపి బాలరాజు సూచనలు చేశారు. రోడ్‌పై వెళ్లే ప్రజలకు, వాహనాలకు ఎట్టి పరిస్థితి లో ఇబ్బంది లేకుండా వ్యాపారులు సహకరించాల‌ని అన్నారు. రామగుండం ట్రాఫిక్ కు ప్రజలకి ఇబ్బంది కలగకుండా రాత్రి 9గంట‌ల‌ తరువాత లోడింగ్ ఆన్ లోడింగ్ చేసుకోవాలి. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు లోడింగ్ అన్ లోడింగ్ చేయకూడదని తెలిపారు. ఎవరైనా సమయం పాటించకపోయినా, అతిక్రమించిన షాపు యజమాని పై లోడింగ్ గాని అన్లోడింగ్ చేస్తున్న వాహనాలపై కేసు రిజిస్టర్ చేస్తామని ఏసీపీ గారు హెచ్చరించారు. ఈ కార్యాక్ర‌మంలో మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.