Mancherial: పాదచారిని ఢీకొన్న కారు.. కారుపైనే పడి ఆ వ్యక్తి మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/accident-in-tanduru-mandal.jpg)
మంచిర్యాల (CLiC2NEWS): రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టగా.. ఆ వ్యక్తి ఎగిరి కారుపై పడి మృతి చెందాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలోని తాంగూరు మండలం బోయనపల్లిలో చోటుచేసుకుంది. బోయనపల్లిలోని జాతీయ రహదారిపై అతివేగంగా వస్తున్న కారు కొండ పోషంను ఢీకొట్టింది. అతను ఎగిరి అదే కారుపై పడి మృతి చెందాడు. ఢీకొట్టిన కారు దాదాపు 150 మీటర్లు మేర వెళ్లి ఆగింది. మరణించిన వ్యక్తి డౌటపల్లికి చెందిన తాపీ మేస్త్రీగా పోలీసులు గుర్తించారు.