వ‌ర్గీక‌ర‌ణ పూర్త‌య్యే వ‌ర‌కు ఉద్యోగ నియామ‌కాలు వ‌ద్దు.. మంద‌కృష్ణ మాదిగ‌

ఢిల్లీ (CLiC2NEWS): ఎస్‌సి, ఎస్‌టి రిజ‌ర్వేష‌న్ల‌న ఉప వ‌ర్గీక‌ర‌ణ చేసే అధికారం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఉంద‌ని దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. ఈ తీర్పుపై ఎమ్మార్పిఎస్ వ్య‌వ‌స్థాప‌కుడు మంద‌కృష్ణ మాదిగ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.  ఢిల్లీలో  ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. వ‌ర్గీక‌ర‌ణ కోసం ఎమ్మార్పియ‌స్ 30 ఏళ్లుగా పోరాటం చేస్తోంద‌న్నారు. ఈ ఉద్య‌మ పోరాటంలో ప్రాణాల‌ర్పించిన ఎమ్మార్పియ‌స్ నేత‌ల‌కు ఈ విజ‌యం అంకిత‌మ‌న్నారు. ప్ర‌క్రియ వేగ‌వంతం చేసేందుకు చొర‌వ చూపిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ధ‌ర్మ‌మే గెలుస్తుంద‌ని.. మాకు అనుకూలంగా తీర్పుఇచ్చినందుఉ జ‌డ్జిల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఉమ్మ‌డి ఎపిలో ఎస్‌సి వ‌ర్గీక‌ర‌ణ చేసింది చంద్ర‌బాబేన‌ని.. మ‌ళ్లి ఇపుడు మాకు అనుకూలంగా తీర్పు వ‌చ్చిన‌పుడు కూడా సిఎం చంద్ర‌బాబే ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు కూడా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. వ‌ర్గీక‌ర‌ణ పూర్త‌య్యే వ‌ర‌కు నియామ‌కాలు చేప‌ట్ట‌వ‌ద్ద‌ని ప్ర‌భుత్వాల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాన‌ని మంద‌కృష్ణ తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ రిజ‌ర్వేష‌న్ల వ‌ర్గీక‌ర‌ణ‌కు `సుప్రీం` గ్రీన్ సిగ్న‌ల్‌

 

Leave A Reply

Your email address will not be published.