Mandapet: ఈ వయసులో మాకు కావలసింది అదేగా బాబూ..

మండపేట (CLiC2NEWS): వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ సంక్షేమ రాజ్యాన్ని తలపిస్తోందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి జగన్ పది కాలాల పాటు చల్లగా ఉంటే మా లాంటి నిరుపేదలకు ఏ కష్టం రానీయకుండా చూసుకుంటారని అభిలషించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రెండో వార్డులో నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ చిట్టూరి సతీష్ ఆధ్వర్యంలో శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు, మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి వార్డులో గడప గడపకు వెళ్ళారు. పెద్ద కాలువ గట్టు ప్రాంతంలో ఉండే ప్రజల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చైర్ పర్సన్ రాణి వారి పిల్లలను చేతిలోకి తీసుకుని,  చిన్నారికి గోరు ముద్ద పథకం అందుతుందామ్మా అంటూ వారిని కుశల ప్రశ్నలు వేశారు. తోట అదే వీధిలో ఉండే ఓ వృద్ధురాలిని సతీష్ తో కలిసి పలకరించాయి. తల్లీ నీకు ప్రభుత్వం ఏ విధంగా సాయ పడుతుందని అడిగారు. ఈ ప్రభుత్వంలో నా లాంటి వృద్దులంతా ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పింది. నెల నెలా అందించే వృద్ధాప్య పింఛను సూర్యుడు పొద్దు పొడవకుండానే ఇంటి తలుపు తట్టి చేతిలో పెడుతున్నారని హర్షం వ్యక్తం చేసింది. ఈ వయసులో మాకు కావలసింది కూడా అదేగా బాబూ అంటూ తోటకు జవాబు ఇస్తూ సిఎంతో పాటు మీరు కూడా బాగుండాలని ఆశీర్వదించింది.

కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గనేశ్వరరావు, జడ్పీటీసీ సభ్యులు కురుపూడి భవాని రాంబాబు, పుట్టపూడి వీర వెంకట సూర్యనారాయణ(అబ్బు), రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, వైసీపీ యువ నేత చోడే శ్రీకృష్ణ, కౌన్సిలర్ లు బొక్కా సరస్వతి, అమలదాసు లక్ష్మి, కొవ్వాడ బేబీ అప్పన్న బాబు, మొండి భవానీ మురళి, పిల్లి శ్రీనివాస్, మారిశెట్టి సత్యనారాయణ, శెట్టి కల్యాణి, మలసాని సీతా మహలక్ష్మి, టౌన్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, షేక్ అండ్ షేక్ డెవలప్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ ఆలీఖాన్ బాబా, శెట్టిబలిజ సంఘం నాయకులు పెంకే గంగాధర్, బెల్లంకొండ దొరబాబు, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు పేపర్తి సాంబు, సాధనాల శివ భగవాన్, కొప్పిరెడ్డి పద్మావతి, కోళ్ల శ్రీనివాస్, కొడమంచిలి భాస్కర రావు, జొన్నపల్లి సత్తిబాబు, ముక్కా దాలయ్య, ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ సూరంపూడి సత్య ప్రసాద్, శెట్టి నాగేశ్వరావు, రెడ్డి రత్తయ్య, టి పుల్లేశ్వరరావు, పిఠాపురం సత్యనారాయణ, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులు, వార్డు ప్రముఖులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.