Manjula Pattipati: గుర్తున్నారా మనకు..!

చిత్తు కాగితాలు ఏరుకుంటూ చినిగిపోయిన బతుకులు ఈడ్చుకుంటూ

బతుకు కోసం ఆకలి తో పోరాటం చేస్తున్న భావి భారత పౌరులు

ఈ బాలకార్మికులు గుర్తున్నారా మనకు..!

ఆరో పంచభూత మైన ఆకలికి వారసులు ఈ బాలకార్మికులు గుర్తున్నారా మనకు..!

ఆటపాటలు చదువుసంధ్యలు అమాయక జీవులు ఈ

బాలకార్మికులు గుర్తున్నారా మనకు..!
కామాంధులు రోడ్డుపై విసిరేసిన ఎంగిలి విస్తరాకులు

ఈ బాలకార్మికులు గుర్తున్నారా మనకు..!
చాలీచాలని జీతాలతో వెట్టి చాకిరి చేస్తూ విధిరాతకు

బలవుతున్న ఈ బాలకార్మికులు గుర్తున్నారా మనకు..!
విరిగిన ఇటుకల కింద నలుగుతూ ,

కడగని చాయ్ కప్పులో మిగిలిన చాయ్ త్రాగి బ్రతుకుబండి ఈడుస్తున్నా

ఈ బాల కార్మికులు గుర్తున్నారా మనకు..!

మంజుల పత్తిపాటి
(ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ )

జాతిని సవాలు చేస్తున్న బాలకార్మిక సమస్య ఇంకనూ కొనసాగుతూనే ఉంది.  ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వివిధ చర్యల్ని చేపడుతూనే ఉంది. అయితే ఇది సామాజిక-ఆర్థిక సమస్యతో ముడిపడి వుండడం వల్లనూ,  దారిద్ర్యంతోనూ, నిరక్షరాస్యతతోనూ కూడినది కావున ఇంకనూ సమాజంలోని అన్ని వర్గాల వారి సమస్యల్ని పరిష్కరించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరగాలి .

నిరక్షరాస్యత, బాలకార్మిక వ్యవస్థ ఒకే నాణేనికి బొమ్మా బొరుసులు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించకుండా అందరికీ విద్యను ఎన్నటికీ అందించజాలం. బాల్యాన్ని బలిపశువులుగా చేయకుండా కాపాడలేమా ఒక్కసారి ఆలోచించండి.
బతుకు చట్రంలో బాల్యం బలి పెడుతున్న బాలకార్మికుల కోసం మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం అని.

-మంజుల పత్తిపాటి

 

Leave A Reply

Your email address will not be published.