పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు ఉషారాణి (పోచక్క)

హైదరాబాద్ (CLiC2NEWS): మావోయిస్ట్ ఉషారాణి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దండకారణ్య డివిజనల్ కమిటి సెక్రటరీగా పనిచేస్తున్న ఉషారాణి అలియాస్ పోచక్క అనారోగ్య కారణాలతో లొంగిపోయినట్లు పేర్కొన్నారు. ఉషారాణి స్వస్థలం ఎపిలోని తెనాలి. ఆమె మద్రాస్ యూనివర్సిటీ నుండి ఎంఎ పట్టా పొందారు. 1980లో మావోయిస్టు పార్టీలో చేరి దండకారణ్య దళంలో కీలక బాధ్యతలు చేపట్టారు. సుమారు 40 ఏండ్ల పాటు ఆమె వివిధ హోదాల్లో మావోయిస్టు పార్టీలో పనిచేశారు.