బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం .. 36మంది సజీవదహనం

ఢాకా (CLiC2NEWS): బంగ్లాదేశ్‌లోని ఝలోరఠి ప్రాంతంలోని సుగంధ నదిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ నౌకలో మంటలు చెలరేగి 36 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఢాకానుంచి బరుంగా వెళ్లున్న మూడంతస్థుల నౌకలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో నౌకలో 500 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 36 మంది మృతిచెందారు. 200మందికి పైగా గాయపడినారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలియజేశారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది దాదాపు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు.