జీవిత బీమా పేరుతో భారీ మోసం..
![](https://clic2news.com/wp-content/uploads/2022/03/FAKE.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో జీవిత బీమా పేరుతో భారీ మొత్తంలో మోసం చేసిన నిందుతులను పోలీసులు మూడు రోజుల వ్యవధిలోనే పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఓ విశ్రాంత ఉద్యోగికి మాయమాటలు చెప్పి జీవిత బీమా చేసుకోవాలంటూ నిందితులు ఒత్తిడి చేశారు. ఆ వ్యక్తి విడతల వారీగా రూ. 3.50 కోట్లు చెల్లించి జీవిత బీమా తీసుకున్నాడు. బీమాకు సంబంధించిన పత్రాలను అమెరికాలో ఉన్న తన కుమారుడు పరిశీలించగా.. అవి నకిలీవని తేలడంతో వారు నిర్ఘాంతపోయారు. మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు వెంటనే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసును సిసిఎస్ పోలీసలు కేవలం మూడా రోజుల్లోనే కేసును ఛేధించారు. నిందితులు కరీంనగర్‌కు చెందిన మనోజ్, వనపర్తికి చెందిన మహేశ్ గౌడ్, గుడివాడకు చెందిన సుబ్రహ్మణ్యంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.