మేడారం మిని జాతర తేదీలు..

మేడారం (CLiC2NEWS): రెండేళ్లకోసారి మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర జరుగుతుంటుంది. మహాజాతర జరిగిన మరుసటి సంవత్సరం మిని జాతర నిర్వహిస్తారు. ఈ సమ్మక్క, సారక్క మిని జాతరకు తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుండి నాలుగు రోజులపాటు ఈ జాతర జరగనుంది. శనివారం సమావేశమైన పూజారులు.. మిని జాతర తేదీలను ప్రకటించారు.