మేడ్చల్‌లో మహిళ దారుణ హత్య
మేడ్చల్ (CLiC2NEWS): మేడ్చల్‌లో దారుణం చోటుచేసుకుంది. దుండగులు ఓ మహిళను హత్యచేసి నిప్పంటించారు. ఈ ఘటన మునీరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ ఆర్) వద్ద చోటుచేసుకుంది. బైపాస్ అండర్ బ్రిడ్జ్ కింద ఓ మహిళను బండరాయితో కొట్టి పెట్రోల్‌పోసి నిప్పంటించారు. స్థానికులు సమాచారం అందించగా.. మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.