కాకినాడ జిల్లాలోని వైద్య కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య
![](https://clic2news.com/wp-content/uploads/2021/01/dead-body.jpg)
కాకినాడ (CLiC2NEWS): జిల్లాలోని రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసి)లో వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంబిబిఎస్ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థి రావూరి సాయిరాం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్ఎంసి బాయ్స్ హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉన్న సాయిరాం ను చూసిన తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సిబ్బంది సాయిరాంను ఆస్పత్రికి తరలించారు. అయినా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.