అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా వైద్య విద్యార్థిని వైష్ణవి..
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్గా వైద్య విద్యార్థిని వైష్ణవిని ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించారు. రాజధాని నిర్మాణానికి ఆమె రూ. 25 లక్షల చెక్కును విరాళం అందజేశారు. అంతేకాకుండా పోలవరం నిర్మాణం కోసం మరో రూ. లక్ష కూడా ఆమె అందిచారు. పొలం అమ్మి మరీ ఆ మొత్తాన్ని ఆ విద్యార్థిని అందజేసిన యువతిని చంద్రబాబు అభినందించారు. రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసినట్లు ప్రకటనలో తెలిపారు.