రాష్ట్రంలో మెగా డిఎస్‌సి నోటిఫికేష‌న్: సిఎం రేవంత్‌రెడ్డి

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో 11,062 టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో గురువారం మంత్రులు, విద్యాశాఖ అధికారుల‌తో క‌లిసి విడుద‌ల చేశారు. మార్చి 4 నుండి ఏప్రిల్ 2వ తేదీ వ‌ర‌కు డిఎస్‌సి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు రుసుం రూ. 1000గా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. రాష్ట్రవ్యాప్తంగా 11 ప‌ట్ట‌ణాల్లో ఆన్‌లైన్ ప‌ద్ద‌తిలో ప‌రీక్ష‌ల‌ను నిర్వహించ‌నున్నారు.

మొత్తం 11,062 పోస్టుల‌లో స్కూల్ అసిస్టెంట్ 2,629 , భాషా పండితులు 727, పిఇటిలు 182, ఎస్‌జిటిలు 6,508, ప్ర‌త్యేక కేట‌గిరీ స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్‌జిటి 796 పోస్టులు ఉన్నాయి. గ‌తేడాది సెప్టెంబ‌ర్ 6న 5,089 పోస్టుల‌తో జారీ చేసిన డిఎస్‌సి ప్ర‌క‌ట‌న‌ను ర‌ద్దు చేస్తూ బుధ‌వారం రాత్రి రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల జారీ చేసింది. గ‌తంలో ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు మ‌ళ్లీ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.