Mandapet: డిసెంబర్ 20న మెగా జాబ్ మేళా..
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/mandapet-degree-college.jpg)
మండపేట (CLiC2NEWS): పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 20వ తేదీన రాష్ట్ర స్థాయి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టీకేవీ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాబ్ మేళాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ మంగళవారం మారేడుబాకలో ఉన్న డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. దాదాపు 11 కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చాయన్నారు. నిరుద్యోగ యువతకు ఈ జాబ్ మేళా మంచి అవకాశమని, అర్హతను బట్టి ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని శ్రీనివాసరావు తెలిపారు. 7 వ తరగతి నుంచి పీజీ వరకూ చదివిన వారంతా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అసక్తి గల అభ్యర్థులు https://tinyuri.com/mdp_kosmd_apssdc లింక్స్ ద్వారా గాని లేదా 9642012265,7993217981 నెంబర్స్ ద్వారా ముందుగా పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలి.