సింధుకు మెగాస్టార్ చిరంజీవి సత్కారం.. వీడియో వైరల్..

హైదరాబాద్ (CLiC2NEWS): రెండు ఒలింపిక్స్ పతకాల విజేత పీవీ సింధుకు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ప్రత్యేకంగా సన్మానించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మెగాస్టార్ నివాసంలో సింధును ముఖ్య అతిథిగా ఆహ్వానించి ప్రత్యేక ఈ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు నాగార్జునతోపాటు రాధిక, సుహాసిని సహా చిరంజీవి కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈమేరకు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వీడియో షేర్ చేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. రెండు ఒలింపిక్స్ పతకాలతో సింధు ఘనత సాధించిందని కొనియాడారు. సింధును ఆత్మీయుల మధ్య గౌరవించడం ఎంతో ఆనందాన్నిస్తోందని చిరు పేర్కొన్నారు. సింధును చూసి దేశం మురిసిపోతుంటే.. ఆమె తన బిడ్డే అనే భావన కలిగిందని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు.
సింధు మాట్లాడుతూ.. చిరంజీవి కుటుంబం తనపై చూపించిన ప్రేమ, గౌరవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని తెలిపారు. వచ్చే ఒలింపిక్స్‌లో తప్పకుండా బంగారు పతకం సాధిస్తానని వెల్లడించింది.
View this post on Instagram
Wow, superb weblog format! How long have you ever been running a blog for? you made running a blog look easy. The entire look of your website is magnificent, as well as the content!!