మెట్రో సేవలు ఇకనుండి రాత్రి 11 గంటల వరకు

హైదరాబాద్ (CLiC2NEWS): మెట్రో ప్రయాణికులకు శుభవార్త. మెట్రో సర్వీసులు ఈ నెల 10 వ తేదీ నుండి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు అధికారులు వల్లడించారు. ఇప్పటి వరకు మెట్రో సర్వీసులు రాత్రి 10.15 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉండగా.. ఈ సమయాన్ని 11 గంటల వరకు పొడిగించారు. మెట్రో ప్రయాణానికి సంబంధించిన టికెట్ బుకింగ్ వాట్సాప్ ద్వారా చేసుకునే అవకాశాన్ని దేశంలో మెదటిసారిగా ప్రారంభించిన విషయం తెలిసినదే.