మైక్రోసాప్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి రాజీనామా

ఢిల్లీ (CLiC2NEWS): మైక్రోసాప్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో పునీత్ చందోక్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. అనంత్ మహేశ్వరి మైక్రోసాప్ట్నుండి బయటకు వెళ్లలనుకుంటున్నారని.. ఈ సంస్థ అభివృద్ధికి ఆయన అందించిన సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ మైక్రోసాప్ట్ ప్రకటన చేసింది. ఆయన భవిష్యత్తు ప్రయత్నాలలో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అనంత్ మహేశ్వరి 2016లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. ఇంతకు ముందు హనీవెల్ ఇండియా ప్రెసిడెంట్‌గా, మెక్కిన్సే అండ్ కంపెనీ ఎంగేజ్మెట్ మేనేజర్‌గా పనిచేశారు.