పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండే కార్మికుల గౌరవవేతనం రూ.3 వేలు పెంపు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేసే కార్మికులకు గౌరవవేతనం రూ. 3000 పెంచుతూ జీవో జారీ చేశారు. ఇప్పటి వరకు వారికి గౌరవవేతనం రూ.వెయ్యి ఉండేది. కార్మికులకు గౌరవ వేతనం రూ. 3 వేలకు పెంచుతామని గత సంవత్సరమే ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు వారికి రూ. 3వేలు సరిపోవని.. రూ. 15 వేల వేతనం ఐతేనే గిట్టుబాటు అవుతుందని మహిళా కార్మికులు అంటున్నారు. ప్రభుత్వం తమపై దయ చూపాలని మధ్యాహ్న భోజన కార్మికులు సర్కార్‌ను వేడుకుంటారు.