తొమ్మిది నియోజకవర్గాల్లో పోటీచేయనున్న ఎంఐఎం

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని శాసనసభ ఎన్నికల్లో 9 స్థానాల్లో ఎంఐఎం పోటీచేయనున్నట్లు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసి ప్రకటించారు. ఈ సారి ఎన్నికలకు రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ నుండి కూడా ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆరు నియోజక వర్గాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను వెల్లడించారు.
ఆరు నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు
చంద్రాయణగుట్ట – అక్బరుద్దీన్ ఒవైసి,
నాంపల్లి – మాజిద్ హుస్సేన్,
ఛార్మినార్ – మాజి మేయర్ జుల్ఫికర్
యాకుత్పురా – జాఫర్ హుస్సేన్ మిరాజ్
మలక్‌పేట – అహ్మద్ బలాల,
కార్వాన్ – కౌసర్ మొయినుద్దీన్