108 బ్రాహ్మ‌ణ దంప‌తుల‌ను స‌త్క‌రించిన‌ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి

నిర్మ‌ల్‌ (CLiC2NEWS): క‌నుమ పండ‌గ సంద‌ర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి 108 బ్రాహ్మ‌ణ దంప‌తుల‌కు పాద‌పూజ చేసి ఘ‌నంగా స‌త్క‌రించారు. ఈసంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి కెసిఆర్ ఆధ్వ‌ర్యంలో రాష్ట్రంలోని పుణ్య‌క్షేత్రాలు అభివృద్ధి చెందుతున్నాయ‌ని అన్నారు. మార్చిలో యాదాద్రి ఆల‌యం పునఃప్రారంభానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని మంత్రి తెలియ‌జేశారు. ఆదేవిధంగా బాస‌ర జ్ఞాన స‌ర‌స్వ‌తి ఆల‌యం, వేముల‌వాడ రాజ‌న్న దేవాల‌యం, కాళేశ్వ‌రం ముక్తేశ్వ‌ర‌స్వామి, ధ‌ర్మ‌పురి ల‌క్షీన‌ర‌సింహ స్వామి అల‌య అభివృద్ధికి సిఎం ప్ర‌త్యేక నిధులు కేటాయించార‌ని ఈ సంద‌ర్భంగా తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.