రాష్ట్రంలో అసలైన రాజకీయ ఆట మొదలైందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో అసలైన రాజకీయ ఆట మొదలైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నగరంలోని బిజెపి కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి మోడి పర్యటనపై కేసిఆర్ తీరు విచారకరమని మంత్రి అన్నారు. ప్రధాని పర్యటనకు ఆహ్వానం పలుకుతూ పెట్రోలియం శాఖామంత్రి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖ రాశారన్నారు. అయినా దేశ ప్రధానమంత్రికి వ్యతిరేఖంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం విచారకరమన్నారు. రాష్ట్రాలలో ప్రాధానమంత్రి పర్యటనకు వస్తే కనీస మర్యాద ఇవ్వాలన్నారు.
గవర్నర్‌ను టిఆర్ ఎస్ ప్రభుత్వం అవమానపరచటాన్ని ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇడి. సిబిఐ దాడులతో కేంద్రప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
Your article helped me a lot, thanks for the information. I also like your blog theme, can you tell me how you did it?