మంచిర్యాల జిల్లా విద్యార్థికి మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ అభినంద‌న‌లు..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): లాంగ్ జంప్ విబాగంలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో స్వ‌ర్ణ ప‌థ‌కాల‌ను సాధిస్తున్న కొత్తూరి ప్ర‌ణ‌య్‌ను రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ అభినందించి, రూ. 3.5ల‌క్ష‌ల న‌గుదు ప్రోత్సాహం అందించారు.
మంచిర్యాల జిల్లాలోని న‌క్క‌ల‌ప‌ల్లి గ్రామానికి చెందిన కొత్తూరి ప్ర‌ణ‌య్ జైపూర్‌లోని గురుకులంలో ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం చదువుతున్నాడు. ప్ర‌ణ‌య్ లాంగ్ జంప్ విభాగంలో రాష్ట్ర,జాతీయ స్థాయిలో బంగారు ప‌త‌కాలు సాధిస్తున్నాడు. ప్ర‌ణ‌య్‌ను ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్‌, మాజీ ఎమ్మెల్సీ పురాణం స‌తీశ్ కుమార్ అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.