మూడు ఎస్టీపీల నిర్మాణానికి మంత్రి కెటిఆర్ శంకుస్థాప‌న‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఉప్ప‌ల్ నియోజ‌క వ‌ర్గంలో మూడు ఎస్టిపిల నిర్మాణానికి రాష్ట్ర ఐటి, మున్సిప‌ల్ శాఖామంత్రి కెటిఆర్ శంకుస్థాప‌న చేశారు.  మ‌హాన‌గ‌రంలో ఉత్ప‌న్న‌మ‌య్యే మురుగు నీటిని వంద శాతం శుద్ధి చేయాల‌నే ల‌క్ష్యంతో రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.3,866.21 కోట్ల వ్య‌యంతో 31 కొత్త సీవ‌రేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ)ను జ‌ల‌మండ‌లి ఆధ్వ‌ర్యంలో నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. జీహెచ్ఎంసీ పరిధిలో మూడు ప్యాకేజీల్లో 31 ఎస్టీపీల నిర్మాణం జ‌రుగుతోంది. ఇందులో భాగంగా మూసీ న‌దికి ఉత్త‌రం వైపు ప‌రివాహ‌క ప్రాంతాల్లో ప్యాకేజ్‌-1 కింద‌ 402.50 ఎంఎల్‌డీ సామ‌ర్థ్యంతో 8 ఎస్టీపీల నిర్మాణం జ‌రుగుతోంది. వీటిల్లో ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని పెద్ద‌చెరువు, కాప్రా చెరువు, న‌ల్ల‌చెరువు వ‌ద్ద‌ 124 ఎంఎల్‌డీ సామ‌ర్థ్యంతో నిర్మిస్తున్న 3 ఎస్టీపీల ప‌నుల‌కు శుక్ర‌వారం మున్సిప‌ల్ శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు శంకుస్థాప‌న చేశారు. ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో వివిధ అభివృద్ధి ప‌నుల‌తో పాటు ఆయ‌న కొత్త ఎస్టీపీల ప‌నుల‌ను సైతం ప్రారంభించారు.

ఈ కార్య‌క్ర‌మంలో కార్మిక శాఖ మంత్రి సీహెచ్.మ‌ల్లారెడ్డి, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, ఉప్ప‌ల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌కిశోర్‌, ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ శ్రీధర్ బాబు, జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్లు, అధికారులు పాల్గొన్నారు.

కొత్త ఎస్టీపీల నిర్మాణంపై కీల‌కాంశాలు…

 

  •  న‌గ‌రంలో ప్ర‌స్తుతం ఉత్ప‌న్న‌మవుతున్న మురుగు – 1950 ఎంఎల్‌డీ
  •  ప్ర‌స్తుతం శుద్ధి చేస్తున్న మురుగు(25 ఎస్టీపీలు) – 772 ఎంఎల్‌డీ
  •  శుద్ధి చేయాల్సిన మురుగు – 1178 ఎంఎల్‌డీ
  •  మిగ‌తా మురుగు శుద్ధి, భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం ప్ర‌తిపాదించిన ఎస్టీపీలు: 62 ఎస్టీపీలు
  •  ప్ర‌స్తుతం శుద్ధి జ‌ర‌గ‌ని 1178 ఎంఎల్‌డీతో పాటు భ‌విష్య‌త్‌లో పెర‌గ‌నున్న 859 ఎంఎల్‌డీ అంచ‌నా క‌లిపి మొత్తం 2,057 ఎంఎల్‌డీ మురుగునీటిని శుద్ధి చేసే సామ‌ర్థ్యం.
  •  కొత్త‌గా నిర్మించ‌నున్న 2057 ఎంఎల్‌డీ సామ‌ర్థ్యం క‌లిగిన‌ 62 ఎస్టీపీలు:
  •  జీహెచ్ఎంసీలో 31 ఎస్టీపీలు – 1259 ఎంఎల్‌డీ
  •  జీహెచ్ఎంసీ బ‌య‌ట 31 ఎస్టీపీలు – 798 ఎంఎల్‌డీ
  •  జీహెచ్ఎంసీలో 3 ప్యాకేజీల్లో ఎస్టీపీల నిర్మాణం ప్ర‌స్తుతం జ‌రుగుతోంది
  •  3 ప్యాకేజీల ఎస్టీపీల నిర్మాణం కోసం హెచ్ఏఎం ప‌ద్ధ‌తిలో(60:40) ప్ర‌భుత్వం రూ.3,866.21 కోట్లు మంజూరు చేసింది.

 

 3 ప్యాకేజీల ఎస్టీపీల వివ‌రాలు:

ప్యాకేజ్ -1 – మూసీ న‌ది ఉత్త‌రం వైపు – 8 ఎస్టీపీలు – 402.5 ఎంఎల్‌డీ – రూ.1,230.21 కోట్లు.

ప్యాకేజ్ – 1 ఎస్టీపీల వివ‌రాలు:

 

  •  అంబ‌ర్‌పేట‌ -212.50 ఎంఎల్‌డీ -Rs. 577.53 కోట్లు.
  •  న‌ల్ల‌చెరువు – 86.50 ఎంఎల్‌డీ -Rs. 261.72 కోట్లు.
  •  కాప్రా చెరువు – 20.00 ఎంఎల్‌డీ -Rs. 74.47 కోట్లు.
  •  నాచారం పెద్ద‌చెరువు – 17.50 ఎంఎల్‌డీ -Rs. 74.81 కోట్లు.
  •  రామ‌చెరువు – 30.00 ఎంఎల్‌డీ -Rs. 103.48 కోట్లు.
  •  బండ చెరువు – 15.00 ఎంఎల్‌డీ -Rs. 55.85 కోట్లు.
  •  మ‌ల్కాజ్‌గిరి ఆర్కేపురం చెరువు- 5.50 ఎంఎల్‌డీ -Rs. 24.63 కోట్లు.
  •  న్యూ అల్వాల్ చెరువు – 15.50 ఎంఎల్‌డీ -Rs. 57.51 కోట్లు.

ఉప్ప‌ల్‌, కాప్రా స‌ర్కిల్‌లో న‌ల్ల‌చెరువు, కాప్రాచెరువు, నాచారం పెద్ద‌చెరువు వ‌ద్ద రూ.411 కోట్ల‌తో 124 ఎంఎల్‌డీ సామ‌ర్థ్యంతో 3 ఎస్టీపీల నిర్మాణం.

 

· ప్యాకేజ్ – 2 – మూసీ న‌ది ద‌క్షిణం వైపు – 6 ఎస్టీపీలు – 480.5 ఎంఎల్‌డీ – రూ.1,355.13 కోట్లు.

ప్యాకేజ్ – 2 వివ‌రాలు:

  •  రాజేంద్ర‌న‌గ‌ర్ స‌ర్కిల్ – 5 ఎస్టీపీలు – 160.50 ఎంఎల్‌డీ -Rs.547.85 కోట్లు.
  •  ఎల్‌బీన‌గ‌ర్ స‌ర్కిల్ – 1 ఎస్టీపీ – 320.00 ఎంఎల్‌డీ -Rs.807.28 కోట్లు.

 

 ప్యాకేజ్ – 3 – కూక‌ట్‌ప‌ల్లి – హుస్సేన్‌సాగ‌ర్ – 17 ఎస్టీపీలు – 376.5 ఎంఎల్‌డీ – రూ.1,280.87 కోట్లు.

ప్యాకేజ్ – 3 వివ‌రాలు:

  •  కూక‌ట్‌ప‌ల్లి స‌ర్కిల్ – 6 ఎస్టీపీలు- 202.00 ఎంఎల్‌డీ -Rs.627.97 కోట్లు.
  •  కుత్బుల్లాపూర్ స‌ర్కిల్ – 5 ఎస్టీపీలు- 66.00 ఎంఎల్‌డీ -Rs.248.44 కోట్లు.
  •  శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్ – 6 ఎస్టీపీలు- 108.50 ఎంఎల్‌డీ -Rs.404.46 కోట్లు.

జీహెచ్ఎంసీ బ‌య‌ట ప్యాకేజ్ – 4లో భాగంగా మంజీరా – న‌క్క‌వాగు ప‌రివాహ‌క ప్రాంతం కోసం రూ.1,095.50 కోట్ల వ్య‌యంతో 340.50 ఎంఎల్‌డీ సామ‌ర్థ్యంతో 10 ఎస్టీపీల నిర్మాణానికి ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపించ‌డం జ‌రిగింది.

 

Leave A Reply

Your email address will not be published.