Mancherial: జిల్లాలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి కెటిఆర్
![](https://clic2news.com/wp-content/uploads/2023/10/ktr-and-balka-suman.jpg)
మంచిర్యాల (CLiC2NEWS): జిల్లాలో రూ. 313 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మందమర్రి ఎమ్మెల్యే. ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు. బహిరంగ సభలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. మొండి చెయ్యి, చెవిలో పువ్వు పెట్టే పార్టీని నమ్మెద్దని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ గ్యారెంటీ ఎపుడో తీరిపోయిందని, ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఐదేళ్లకు ఐదుగురు సిఎంలు అవుతారన్నారు.
బాల్కసుమన్ మంత్రి అయితే ఎన్నో అద్భుతాలు చేస్తారని కొనియాడారు. అతను ఓయు విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని మంత్రి గుర్తు చేశారు. నియోజక వర్గానికి మంత్రులుగా వచ్చినవారెవ్వరూ చేయని పనులను సుమన్ చేసి చూపించారని కొనియాడారు.