ఓఆర్ఆర్ – 2 పైప్‌లైన్‌ ప్రారంభించిన మంత్రి మ‌ల్లారెడ్డి

మేడ్చ‌ల్ (CLiC2NEWS): ఓఆర్ఆర్ – 2 లోని ప్యాకేజ్ – 2లో భాగంగా మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని శామీర్‌పేట మండ‌లంలో వేసిన నూత‌న పైప్‌లైన్‌ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామ‌కూర మ‌ల్లారెడ్డి ప్రారంభించారు. దేవ‌ర‌యంజాల‌లోని మ‌హాల‌క్ష్మీ కాల‌నీ, సాద లింగారెడ్డి కాల‌నీ, తూంకుంట‌లోని ఎస్సీ కాల‌నీ, సింగాయిప‌ల్లిలోని స్టేట్ బ్యాంక్ కాల‌నీ, సైనిక్ కాల‌నీల్లో పైప్‌లైన్‌ను ఆయ‌న ప్రారంభించారు. ఈ కాల‌నీల్లో మొత్తం 215 కొత్త న‌ల్లా క‌నెక్ష‌న్లు ఇవ్వ‌నున్నారు. మొత్తం 1950 మంది ప్ర‌జ‌లకు ల‌బ్ధి క‌లుగుతుంది. ఔట‌ర్ రింగ్ రోడ్డు ప‌రిధిలోని మున్సిపాలిటీలు, మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు, గ్రామ పంచాయ‌తీలు, కాల‌నీలు, గేటెడ్ క‌మ్యూనిటీలకు తాగునీటిని అందించేందుకు రూ.1200 కోట్ల‌తో జ‌ల‌మండ‌లి ఓఆర్ఆర్ – 2 ప్రాజెక్టు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.