రేషన్ బియ్యాన్ని కూడా వదలని అధికారులు..!
అమరావతి (CLiC2NEWS): ఎపిలోని కాకినాడలో 43,249 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టించేవారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా రేషన్ బియ్యం అక్రమ తరలింపులోలో ఐదుగురు ఐపిఎస్‌ల పాత్ర ఉందని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఇవ్వాల్సిన రూ. 600 కోట్లు త్వరలో చెల్లిస్తామని, ధరల స్థిరీకరణపై రిటైల్ వర్తకులతో ఆయన సమీక్ష నిర్వహించారు. విజయవాడ ఎపిఐఐసి కాలనీలోని రైతు బజార్లో రాజితీపై నాణ్యమైన బియ్యం, కందిపప్పు పంపిణీ కౌంటర్ ను ప్రారంభించారు.