డ్రోన్లు , ఎఐ వినియోగించి తిరుమలలో భక్తుల రద్దీ నియంత్రణ

తిరుపతి (CLiC2NEWS): తిరుపతిలో నిర్వహించిన ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పోలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. దీనిలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్‌షాప్‌లు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. భక్తులను ఆలయాలకు మరింత చేరువ చేసే దిశగా చర్యలు చేపడతామని, డ్రోన్లు, ఎఐ వినియోగంతో భక్తుల రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలలో టికెట్ బుకింగ్, ఆలయ సర్వీసులు మరింత సరళతరం చేస్తామని తెలిపారు. తిరుపతి ఘటన దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిఎం ఆదేశించారని మంత్రి తెలిపారు.