తెలంగాణ నుండి ఎంపికైన బిజెపి ఎంపిలు రాజీనామా చేయాలి..

హైద‌రాబాద్ (CLiC2NEWS): మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్.. బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌ రాష్ట్రం నుండి ఎంపికైన బిజెపి ఎంపిలు రాజీనామా చేయాల‌న్నారు. మంగ‌ళ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రామ‌చంద‌ర్ రావు మ‌రోసారి త‌న నిజ స్వ‌రూపం బ‌య‌ట‌పెట్టార‌ని.. బిసిల రిజ‌ర్వేష‌న్లు 9వ షెడ్యూల్లో చేర్చ‌డం అసాధ్యం అంటున్నార‌న్నారు. త‌మిళ‌నాడుతో రిజ‌ర్వేష‌న్లు పెంచార‌న్నారు. రాష్ట్రం నుండి ఎన్నికైన బిజెపి ఎంపిలు రాజీన‌మా చేయాల‌ని.. వారు రాజీనామా చేస్తే.. బిసి రిజ‌ర్వేష‌న్లు ఎందుకు అమ‌లుకావో చూస్తామ‌న్నారు. బిసి రిజ‌ర్వేష‌న్ల పెంపుపై కేంద్రం వెంట‌నే నిర్ణ‌యం తీసుకోవాల‌ని, బిసి వ‌ర్గాల‌కు అన్యాయం జ‌రిగితే చూస్తూ ఉరుకోమ‌ని పొన్నం ప్ర‌భాక‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.