కాళోజీకి మంత్రి సత్యవతి ఘన నివాళి

హైదరాబాద్ (CLiC2NEWS): ప్రజాకవి కాళోజీ నారాయణ రావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తన రచనలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూరాని అన్నారు. తెలంగాణ యాస, పడికట్టు పదాలతో వాడుక భాషకు పట్టం కట్టిన మహాకవి అని మంత్రి గుర్తుచేసుకున్నారు. కాళోజీ స్పూర్తితో.. ముఖ్యమంత్రి కెసిఆర్ నేర్పుతో తెలంగాణ ఉద్యమం లక్ష్యం చేరిందన్నారు.