అభివృద్ధే సిఎం కెసిఆర్ లక్ష్యం: మంత్రి సత్యవతి రాథోడ్
భూపాలపల్లి (CLiC2NEWS): అభివృద్ధి, సంక్షేమమే సిఎం కెసిఆర్ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర గిరిజన శాక మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం పోచంపల్లి గ్రామంలో నీతి అయోగ్ కింద మంజూరైన 10 లక్షల రూపాయలతో అంగన్‌వాడీ భవనాల మరమ్మతుల పనులను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సుపరిపాలన కొనసాగుతుందని ఆమె అన్నారు. అభివృద్దే లక్ష్యంగా సిఎం కెసిఆర్ ముందుకు సాగుతున్నారని, రాష్ట్ర అభివృద్ది కోసం అందరూ కలిసి రావాలని అన్నారు.