ధాన్యం కోనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ధాన్యం కొనుగోళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్ల పై మంత్రి శనివారం పౌరసరఫరాల శాఖ ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి కొనగోళ్లను పర్యవేక్షించాలని.. ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీశారు. ఈ ఏడాది యాసంగిలో రికార్డు స్థాయిలో 127.50లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. వాన కాలం, యాసంగి కలిపి 281 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశముందన్నారు.దానికి అనుగుణంగా కొనుగోలు కోసం ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.