మిర్యాల‌గూడ‌లో హృద‌యవిదార‌క ఘ‌ట‌న‌..

మిర్యాల‌గూడ‌ (CLiC2NEWS): క‌న్న త‌ల్లిని బ‌తికుండ‌గానే శ్మ‌శానంలో వ‌దిలేయాల‌నుకున్న‌డు ఓ ప్ర‌భుద్దుడు. ఈ ఘ‌ట‌న న‌ల్గొండ జిల్లా మిర్యాలగూడ మండ‌లంలో చోటుచేసుకుంది. బాధితులు, గ్రామ‌స్థులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. ప‌ల్నాడు జిల్లా దాచేప‌ల్లి మండ‌లం ఎర్రావుల‌పాడు గ్రామానికి చెందిన వెంక‌టేష్ త‌న త‌ల్లి అయిన వెంక‌ట‌ర‌త్నమ్మ‌ను వ‌దిలించుకోవాల‌ని.. మూడు రోజుల క్రితం ఆటోలో తీసుకువ‌చ్చి మిర్యాల గూడ మండ‌లం వాట‌ర్ ట్యాంక్ తండా గ్రామంలోని వైకుంఠ‌ధామం వ‌ద్ద వ‌దిలి వెళ్లిపోయాడు. వృద్ధురాలిని గ‌మ‌నించిన గ్రామ‌పంచాయితీ సిబ్బంది స‌ర్పంచ్‌కు స‌మాచార‌మిచ్చారు. స‌ర్పంచ్‌.. వృద్ధురాలిని అక్క‌డే ఉన్న ఒక షెడ్‌లో ఉంచి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. పోలీసులు, అంగ‌న్‌వాడి సిబ్బంది ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స‌నందిస్తున్నారు. అత‌ని కుమారిడిని ర‌ప్పిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.