బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దివాకర్ రావు
మంచిర్యాల (CLiC2NEWS): మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు శనివారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా అర్హులైన మహిళలకు బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
స్థానిక 20వ వార్డు రాంనగర్ లోని సబ్ స్టేషన్‌లో బతుకమ్మ చీరల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేద ప్రజలు బతుకమ్మ పండుగను కొత్త బట్టలు ధరించి సంతోషంగా జరుపుకోవాలని ప్రతి ఏడాది ఆడపడుచులకు ముఖ్యమంత్రి కెసిఆర్ చీరలను బహుకరిస్తున్నారని అన్నారు. మంచిర్యాల పట్టణంలోని పలువార్డులలో ఇవాళ మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ ప్రారంభించామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సిఎం కెసిఆర్ రాష్ట్రంలో అన్ని మాతాలన గౌరవిస్తున్నారని తెలిపారు. మహిళల సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెలు ఎంతో అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు తిరుపతి, మాజీ కౌన్సెలర్ అంకం మనోజ్, పట్టణ యూత్ అధ్యక్షుడు గాండ్ల సంజయ్, 20 వార్డు టిఆర్ ఎస్ అధ్యక్షుడు కొట్టెరవి తదితర టిఆర్ ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
