హరీష్, సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ కాదు.. కవిత సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ జాగృతి భవన్లో కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై ఇద్దరు పనిగట్టుకుని విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హరీశ్‌రావు, సంతోష్‌రావు ఇళ్లలో బంగారం ఉంటే.. బంగారు తెలంగాణ కాదని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుందన్నారు. నా తండ్రి కెసిఆర్ చిటికెన వేలు పట్టుకుని నడిచిన దాన్ని, ఆయన స్ఫూర్తితో సామాజిక తెలంగాణ అని మాట్లాడానన్నారు. అది పార్టికి వ్యతిరేకంగా మాట్టాడుతున్నానని ఆరోపించారు. రామన్నా.. నీ చెల్లిని, ఒక మహిళా ఎమ్మెల్సీని , నాపై కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ భవన్లో ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పా.. అయినా న్యాయం జరగలేదు. బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించరా అని ప్రశ్నించారు. ఒక మామూలు మహిళా కార్యకర్తకు పార్టీలో అన్యాయం జరిగితే స్పందిస్తారా.. తనకైతే అనేమానమేనని అన్నారు.
Also Read: `ఎమ్మెల్సీ`కి రాజీనామా చేస్తా: కవిత