హిందీ వ్యాసరచన పోటీ విజేతలకు సర్టిఫికెట్లు పంపిణీచేసిన ఎమ్మెల్సీ తోట
మండపేట (CLiC2NEWS): జాతీయ హిందీ దినోత్సవం (హిందీ దివస్ )ను పురస్కరించుకుని మంగళవారం హిందీ వ్యాసరచన పోటీల్లో విజేతలకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ప్రపంచంలోని ప్రాచుర్యం పొందిన భాషలో హిందీకి ప్రత్యేక స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఆయన వకృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు ధృవపత్రాలను అందజేసారు. పట్టణానికి చెందిన జ్ఞాన జ్యోతి హిందీ విశ్వవిద్యాలయం పండిట్ తాతవోలు పార్వతీదేవి ఆధ్వర్యంలో దాదాపు 70 మంది విద్యార్థులు హిందీ వ్యాఖ్య రచన పోటీల్లో విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన హిందీ దేశంలో రెండవ భాషగా పిలువ బడుతుంది. దేశంలో 50 శాతానికి పైగా హిందీ మాట్లాడుతున్నారని అన్నారు. సాక్షాత్తు జాతిపిత మహాత్మా గాంధీ హిందీని భారత జాతీయ భాషగా ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. మాతృభాష తెలుగుతో పాటు హిందీ కూడా నేర్చుకుంటే మంచిది అన్నారు. రాష్ట్రం విడిచి దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లిన హిందీ అవసరం తెలుస్తుంది అన్నారు. అనంతరం తోటను దుస్సాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గా రాణి, కౌన్సిలర్ లు శెట్టి కళ్యాణి, మందపల్లి రవికుమార్ , టౌన్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, రూరల్ కన్వీనర్ పిల్లా వీరబాబు, వైసీపీ నాయకులు శెట్టి నాగేశ్వరరావు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Wow, awesome blog layout! How long have you been running a blog for? you made blogging glance easy. The full glance of your website is magnificent, let alone the content!!