Mnacherial: జిల్లాలో కొనసాగుతున్న లిక్కర్ దాడులు

మంచిర్యాల‌ (CLiC2NEWS): జిల్లాలోని మద్యం షాపులపై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఈ మ‌ధ్య కాలంలో బెల్లంప‌ల్లి ప్రాంతాల్లో అలాగే జైపూర్ మండ‌లోని ప‌లు చోట్లు పోలీసులు విస్తృత త‌నికీలు నిర్వ‌హిస్తూ అక్ర‌మ మ‌ద్యం, క‌ల్తీ మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిపే వారికి చుక్క‌లు చూపిస్తున్నారు. తాజాగా జైపూర్ మండ‌లంలోని ఇందారం గ్రామంలో కల్తీ మద్యం దందాని గుట్టురట్టు చేశారు రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు. లక్ష్మీగణపతి వైన్స్ ను సీజ్ చేశారు. తాజాగా ఇందారం సమీప గ్రామంలోని రామారావుపేట్ గ్రామంలో అక్రమ మద్యం అమ్మకాలు చేస్తున్న దుకాణాలపై దాడులు నిర్వహించారు.

జైపూర్ ఎస్సై రామకృష్ణ  ఇత‌ర‌ సిబ్బందితో కలిసి ఇందారం, రామారావుపేట గ్రామాల్లో దాడులు నిర్వ‌హించారు. రామారావుపేట గ్రామంలో ఎలాంటి అనుమ‌తులు లేకుండా వైన్ షాప్ నుండి మద్యం తీసుకుని వచ్చి అమ్మకాలు జరుపుతున్న దుకాణాలపై దాడులు నిర్వహించారు.

అక్రమంగా అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారనే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు జైపూర్ పోలీసులు ఈ దాడులు చేపట్టారు. రామారావుపేట్ లోని నాలుగు ఇళ్లల్లో సుమారు రూ. 34,620 విలువ గల మద్యాన్ని పట్టుకున్న జైపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.