Modi: దీపావళి వరకు పేదలందరికీ ఉచిత రేషన్
న్యూఢిల్లీ (CLiC2NEWS): కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా పేదలకు ఉచిత రేషన్‌ను మరికొన్ని నెలల పాటు పంపిణీ చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. దీపావళి వరకు పీఎం గరీభ్ కళ్యాణ్ అన్నదాన యోజన పథకం కొనసాగుతుందని, పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని జాతినుద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఎవరూ ఆకలితో బాధపడొద్దనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ వరకు 80కోట్లకు పైగా పేద ప్రజలకు ప్రతినెలా ఉచితంగా ఆహార ధాన్యాలను అందిస్తామని తెలిపారు.