వారణాసిలో కాలినడకన అర్థరాత్రి మోడీ..

వారణాసి (CLiC2NEWS): రెండు రోజుల పర్యటనలో భాగంగా కాశీలో నిన్న (సోమవారం)టి నుండి ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ బిజీబిజీగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిన్న ఉదయం కాశీ విశ్వనాథున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు గంగా నదిలో స్నానమాచరించి సూర్య నమస్కారాలు సమర్పించారు.
తర్వాత భారతీయ జనతాపార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశం అర్థరాత్రి వరకూ కొనసాగింది.
ఈ భేటీ అనంతరం అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ప్రధాని మోడీ వారణాసి లో లేట్‌నైట్ టూర్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌తో కలిసి కాశీవీధుల్లో నడుస్తూ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రధాని మోడీ పరిశీలించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ప్రధాని ట్విట్టర్లో పోస్టు చేశారు.
“ ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించాం. ఈ కాశీలో భక్తులకు ఉత్తమ సదుపాయాలు కల్పించేందుకు మరింత కృషి చేస్తాం“ అని మోడీ తెలిపారు.
Inspecting key development works in Kashi. It is our endeavour to create best possible infrastructure for this sacred city. pic.twitter.com/Nw3JLnum3m
— Narendra Modi (@narendramodi) December 13, 2021