Kagajnagar: ముగ్గురు కూతుళ్లతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం!

కాగజ్నగర్ (CLiC2NEWS): కుటుంబంలొ కలహాల కారణంగా ఓ తల్లి తన ముగ్గురు కూతుళ్లతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కుమురం భీం ఆసీఫాబాద్ జిల్లా కాగజ్నగర్ గజ్జెడలో చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి తల్లీ కూతుళ్లు బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. గమనించిన కుటుంబ సభ్యులు వారిని కాగజ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మద్యానికి బానిసైన భర్త వేధింపులు కారణంగా మహిళ ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.