ఖమ్మం: మున్నేరు వాగు ఉద్ధృతం.. ముంపులో చిక్కుకున్న పలు కాలనీలు

ఖమ్మం (CLiC2NEWS): భారీ వర్షాలకు ఖమ్మం నగరం జలదిగ్భంధమైంది. పలు కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి. కుండపోత వర్షాలతో జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రాజీవ్ గృహకల్పకాలని, వేంకటేశ్వర్‌నగర్, గణేశ్‌నగర్, దానవాయిగూడెం పలు ప్రాంతాలల్లో భారీగా వరద నీరు చేరుకుంది. పలు ఇళ్లు సైతం నీటమునిగాయి. రాజీవ్ గృహకల్ప కాలనీలో భారీగా వరద నీరు చేరుకుంది. అక్కడ అపార్ట్‌మెంట్‌లో కుంటుంబం చిక్కుకుంది. వారిని కాపాడాలని బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. వెంకటేశ్వర్‌నగర్‌లో ఓ ఇంటిని మున్నేరు వరద నీరు చేరుకుంది. ఏడుగురు బాధితులు ఇంటిపైకి చేరుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.
మరోవైపు పాలేరు వాగు పొంగి ప్రవహిస్తుండటంతో ఓ కుంటుంబం చిక్కుకుని వరద ఉద్థృతికి ప్రవాహంలో కొట్టుకుపోయారు. జిల్లాలోని కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో ఈఘటన చోటుచేసుకుంది. ప్రవాహంలో కొట్టుకుపోతున్న యువకుడిని స్థానికులు, పోలీసులు రక్షించారు. దంపతుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం.