మునుగోడు ఉప ఎన్నిక: విజయం దిశగా టిఆర్ఎస్

నల్లగొండ (CLiC2NEWS): మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇవాళ జరుగుతున్న ఉప ఎన్నిక కౌంటిగ్‌లో అధికార పార్టీ హవా కొనసాగుతోంది. 13వ రౌండ్లు పూర్తయ్యే సమయానికి టిఆర్ఎస్ 9 వేలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఈ రౌండ్‌లో టిఆర్ ఎస్‌కు 6619 ఓట్లు రాగా, బిజెపికి 5406 ఓట్లు వచ్చాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితికి 9136 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
ఫలితాల్లో కారు జోరు కొనసాగుతుండటంతో తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టిఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా పేల్చతూ సంబరాలు చేసుకుంటున్నారు.
తప్పక చదవండి: 13వ రౌండ్ రౌండ్ పూర్తి.. టిఆర్ఎస్ 9 వేల ఆధిక్యం