Murder:సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య

సంగారెడ్డి (CLiC2NEWS): జిల్లాలో నిద్రిస్తున్న వ్యక్తిని అతి దారుణంగా హతమార్చారు. జిల్లాలోని గుమ్మడిదల మండలం అన్నారంలో దుండగులు ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అన్నారం ఇటుక బట్టీలలో హిమాన్షు పటేల్ (23) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.