సింగరేణిలో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తాం.. సిఎండి బలరామ్
![](https://clic2news.com/wp-content/uploads/2024/01/N.Balaram-is-as-singareni-new-cmd.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): సింగరేణి సిఎండిగా ఎన్.బలరామ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా బలరామ్ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం సహాయంతో మరిన్ని కొత్తగనులను ప్రారంభిస్తామని, కార్మికుల సంక్షేమంపై దృష్టి సారిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. సింగరేణిని దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలుపుతామని ఆయన అన్నారు. అంతేకాకుండా కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. సింగరేణిలోలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంగనే గుర్తించి భర్తీ చేస్తామన్నిరు. ఈ ఏడాదిలో నిర్దేశించిన 700 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించాలంగే ఉత్పాదకత పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.