Ramzan: శుక్రవారం స్పెషల్

రంజాన్ మాసంలో ముస్లిం సోదరాసోదరిమణులకు నాకు తెలిసిన కొన్ని దుఆలు చెపుతున్నాను. వీటిని చదివి ఆచరిస్తే ఎంతో ప్రతిఫలం లభిస్తుంది. ఇలాంటివి మనం చిన్న చిన్న వాక్యాలు ఈ రంజాన్ మాసంలోనే అందరు నేర్చుకోవాలి.

ఖురాన్ చదివిన వారికీ అన్ని తెలుసు. కానీ ఇంకా కొంతమంది కి తెలియదు. తెలిసినవారు, తెలియనివారికి ఈ దుఆలు చెపితే వారు కూడా వీటిని కంఠస్థం పట్టి వాటిని ఆచరణలో పెడుతారు.

1. ఏదైనా పని ప్రారంభించినపుడు : బిస్మిల్లా హిర్రహమా నిర్రహీమ్ అని పలకవలెను.

2. ఏదైనా పని చేయాలనే సంకల్పం చేసినపుడు : ఇన్షా అల్లాహ్ అని పలకవలెను.

3. ఎవరైనా ముసల్మాన్ ను కలిసినపుడు “అస్సలాము అలైకుం వరాహ్మాతుల్లాహి వబరకాతుహు అని పలకవలెను.

4. ఏదైనా ఆపద వచ్చిన ఆందోళన పడిన “యా అల్లాహు ” అని పలకవలెను.

5. ఏదైనా వస్తువు మనసుకి నచ్చినపుడు “మాషా అల్లాహ్ ” అని పలకవలెను.

6. ఎవరైనా సహాయం చేసినపుడు “జజాకల్లాహ్ ” అని పలకవలెను.

7. సంతోష సందర్బంలో “ఫత బారకల్లాహ్ ” అని పలకవలెను.

8. చెడు మాట వినినపుడు “ల ఊజు బిల్లాహ్ “అని పలకవలెను.

9. వాగ్దానం చేసినపుడు ” వల్లాహి బిల్లాహ్ ” అని పలకవలెను.

10. వీడ్కోలు పలుకునపుడు “ఫీ అమానిల్లాహ్ “అని పలకవలెను.

11. దాన ధర్మాలు చేయునపుడు “ఫీసబీలిల్లాహ్ “అని పలకవలెను.

12. పాపక్షమాపణ కొరకు “అస్ తగ్ ఫిరుల్లాహ్ “అని పలకవలెను.

13. తుమ్ము వచ్చినపుడు “అల్హందులిల్లాహ్ “అని పలకవలెను.

14. ఎవరిదైనా మరణ వార్త వినినపుడు లేక ఏదైనా వస్తువు పొగట్టుకోపోయినపుడు “ఇన్నా లిల్లాహి వఇన్నా ఇలైహి రాజి ఊన్
“అని పలకవలెను.

15. ఉదయం, సాయంత్రం చదివే దుఆ “బిస్మిల్లా హిల్లాజీ లాయజుర్రు మఆ ఇస్మీహి షైఉన్ ఫిల్ ఆర్జి వలా ఫీస్సమాయి వహువస్స మీఉల్ అలీమ్ “(తిర్మిజీ )

బహార్ అలీ

73961 26557

Leave A Reply

Your email address will not be published.